ఎవరు మీలో కోటీశ్వరుడు @ ఆగస్ట్ 22

వెండితెరపై జూనియర్ ఎన్టీఆర్ కు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. అలాగే బుల్లితెరపై కూడా ఆయనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఆయన బుల్లితెరపై హోస్ట్ గా ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ షో తో ఎంట్రీ ఇచ్చారు. ఈ షో ని సక్సెస్ ఫుల్ గా రన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ని పెంచారు. మళ్ళీ రీసెంట్ గా ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి వస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ తో అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ పై రిలీజ్ చేసిన ప్రోమోలు, డైలాగ్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షించాయి. ఈ నెలలోనే ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమాన్ని తెర ముందుకు తీసుకొస్తున్నారు. అది కూడా మెగా స్టార్ చిరు బర్త్ డే రోజున ఈ షోని స్టార్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

లేటెస్ట్ ప్రోమోలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి సందడి చేయనున్నారు. హాట్ సీట్ లో రామ్ చరణ్ ను కూర్చోబెట్టి జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో వీరిద్దర్ని ఒకే వేదికపై చూస్తుంటే ప్రేక్షకులకు కన్నులపండుగగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ కి నిజంగానే హాట్ సీట్ లో కూర్చున్నట్లుగా అనిపించింది. ఫైనల్ గా ఎప్పట్నుండో వెయిట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఆగస్ట్ 22న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది.