దానధర్మాలతో పునీతుడు

దానధర్మాలతో పునీతుడు

 

మీరు కన్నడలో మంచి హీరో..సూపర్ స్టార్ అని తెలుసు…మీ గురించి అంతకు మించి నాకు తెలీదు..
కానీ ఈ రోజు తెలుసుకున్నాను..

22 అనాధశ్రమాలు..
32 గ్రామాలు దత్తత..
18 గోశాలలు..
వేలమందిని చదివిస్తున్నారని…
ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి బోజనం…
ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపే నిజమైన హీరో..
అందరూ హీరోలు కావాలని అనుకుంటారు
వాళ్ళు చేసే మంచి పనులు నిజమైన హీరోలుగా
ప్రజల మనస్సులో ఎప్పటికీ సజీవంగా ఉంటారు..

ఇలాంటి మనసున్న మహారాజుని కోల్పోవడం నిజంగా అందరికీ తీరని లోటు…కానీ మరీ ఇంత చిన్న వయసులో 46 ఏళ్లకే చనిపోవటం మాత్రం బాధాకరం సార్….

డబ్బు, హోదా, పలుకుబడి ఎన్ని ఉన్నా చావు అనేది ఎవరికీ ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం.. చావు వచ్చాకా తప్పించుకోలేము..

మనకి దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో ఉన్నంతలో సంతోషంగా బతకడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి…ప్రతి నిమిషం ఎంజాయ్ చేయండి..

పుట్టుకతో ఏమి తీసుకురాము.. వట్టి చేతులతో వస్తాం.. పోయేటప్పుడు వట్టి చేతులతోనే పోతాం..

ఈ నిజాన్ని చాలా మంది గ్రహించలేక కూర్చొని తిన్నా, తరతరాలు బతకడానికి సరిపోయేంత ఉన్న కూడా ఇంకా ఇంకా సంపాదించాలి అనే అత్యాశతో కొంతమంది అవినీతి చెస్తే, మరి కొంతమది లేనిపోని దుర్మార్గపు పనులు అన్ని చేస్తుంటారు.. ఎందుకు అలాంటి డబ్బు?? చివరకు మీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నా, లక్షల కోట్లు ఉన్నా పోయే సమయం వచ్చింది అంటే ఎవరు ఆపలేరు..