హుజురాబాద్‌, బద్వేల్‌ ఉపఎన్నికలు వాయిదా

Huzurabad, Badwell by-elections postponed

 

హుజూరాబాద్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు షాక్‌ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హుజూరాబాద్ ఉపఎన్నికను వాయిదా వేసింది. అంతే కాకుండా ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లాలో బద్వేల్‌ నియోజకవర్గానికి జరగాల్సిన ఉప ఎన్నికను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 31 నియోజకవర్గాల ఉపఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు సీఈసీ పేర్కొంది. మరో 3 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు జరగాల్సిన ఉప ఎన్నికల్ని కూడా వాయిదా వేశారు. దీపావళి తర్వాతే హుజురాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.