తెలంగాణ‌లో కొత్తగా 331 పాజిటివ్‌ కేసులు

తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 38,192 మందికి కరోనా నిర్ధార‌ణ‌ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 331 పాజిటివ్‌ కేసులు తేలాయి. క‌రోనా కార‌ణంగా నిన్న మ‌రో ముగ్గురు మృతి చెందారు. ఇక క‌రోనా నుంచి 394 మంది కోలుకున్నారు. తెలంగాణ‌లో ఇప్పటి వరకు 2,90,640 మంది కరోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇందులో ఇప్ప‌టికే 2,84,611మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. అటు ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కార‌ణంగా 1,571 మృత్యువాత‌ప‌డ్డారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,458గా ఉంది. ఇందులో 2,461 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టిదాకా 73. 50 ల‌క్ష‌ల క‌రోనా టెస్టులు నిర్వ‌హించారు.