అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడాదికి 1.25లక్షల మంది శరణార్థులను అంగీకరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే దీనిని అమలు చేసేందుకు ఆలోచనలున్నాయని, కాంగ్రెస్ తో మంతనాల తర్వాత క్లారిటీ వస్తుందని వైట్ హౌజ్ వర్గాలు ప్రకటించాయి. ట్రంప్ హాయంలో 15వేల మంది శరణార్ధులను సంవత్సరానికి కేవలం మాత్రమే అంగీకరించేవారు.
జో బైడెన్ ఇప్పుడు ఏకంగా 8 రేట్లు పెంచి, 1.25లక్షలకు పెంచనున్నారు. 1980లో యూఎస్ అత్యధికంగా 2,07,000 మంది శరణార్థులను ఆశ్రయం కల్పించింది. 2020లో ఈ సంఖ్య 12వేలు మాత్రమే. ఇక డొమోక్రట్ల నుండి అధ్యక్షుడుగా గెలిచిన బరాక్ ఒబామా పరిపాలన కాలం చివరి ఏడాదిలో 85వేల మంది శరణార్థులను అంగీకరించింది.