శ్రీకాకుళం జిల్లాలో ఎసిబి వలలో భారీ అవినీతి చేప పడింది. జిల్లాలోని టెక్కలి మండల కేంద్రంలో ఓ స్థలం పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు తహసీల్దార్ బి.నాగభూషణరావు బాధితుడి కి అయిదు లక్షలు డిమాండ్ చేశాడు.. దీంతో ఎసిబి ని బాధితుడు ఆశ్రయించాడు. ఎసిబి అధికారుల సూచన మేరకు శుక్రవారం రాత్రి టెక్కలి మండల కేంద్రంలోని తహసీల్దార్ అద్దె ఇంటిలో ఉన్న సమయంలో 4లక్షల మొత్తాన్ని అందించాడు. సరిగ్గా ఇదే సమయంలో దాడులు చేసిన ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాగా తహశీల్దార్ నాగభూషణరావు పై గతంలో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పాతపట్నం మండల కేంద్రంలో 2010 లో పదకొండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.. వరుసగా ఎసిబి అధికారులు సోదాల్లో నాగభూషణరావు దొరకడం.. తాజాగా అధిక మొత్తం తీసుకుంటూ అడ్డంగా బుక్కవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కేసు నమోదు చేసుకున్న ఎసిబి అధికారులు నిందితుడిని ఎసిబి కోర్ట్ లో హాజరుపరచనున్నారు.