కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న తెలంగాణకు అమిత్ షా రానున్నారు. మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. సెప్టెంబర్ 17న నిర్మల్లోని వెయ్యి ఊడలమర్రి దగ్గర బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినవారిని మర్రిచెట్టు వద్ద రజాకార్లు ఊచకోత కోశారు. సెప్టెంబర్ 17నాటికి బండి సంజయ్ పాదయాత్ర నిర్మల్ చేరుకునేలా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది.విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్ షా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నాయి బీజేపీ శ్రేణులు.