బాలీవుడ్ లో తెలుగు టపాసు దుమారం

తెలుగమ్మాయిలు బాలీవుడ్ లో అవకాశం అందుకోవడం అంటే ఆషామాషీ కాదు. రేఖ- హేమమాలిని- శ్రీదేవి- జయప్రద- వహీదా రెహమాన్- టబు .. వీళ్లంతా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా రాణించారు.

సౌత్ నుంచి ఇంకా ఎందరో ప్రయత్నించినా పార్ట్ టైమర్స్ గా మాత్రమే మిగిలారు. ఇటీవల అదితిరావ్ హైదరీ బాలీవుడ్ లో పలు క్రేజీ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఒకేసారి రెండు హిందీ సినిమాల్లో నటిస్తూ హాట్ టాపిక్ గా మారింది నవతరం తెలుగమ్మాయి అమ్రిన్ ఖురేషి.

పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్` దర్శకనిర్మాత సాజిద్ ఖురేషి కుమార్తె.. రాయల్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత ఎమ్.ఐ.ఖురేషి మనవరాలు అమ్రిన్ ఖురేషి. ప్రస్తుతం హిందీ చిత్రసీమ సహా తెలుగు తమిళంలో నూ కథానాయికగా రాణించాలని కలలు గంటోంది. ప్రస్తుతం ఈ భామ ఒకేసారి రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి రెండూ యాధృచ్ఛికంగా తెలుగు బ్లాక్ బస్టర్లకు రీమేక్ సినిమాలు.

తెలుగు బ్లాక్ బస్టర్లు సినిమా చూపిస్త మావ – జులాయి సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లోనూ అమ్రిన్ ఖురేషి హీరోయిన్ గా నటిస్తోంది. `సినిమా చూపిస్త మావ` రీమేక్ బ్యాడ్ బాయ్ కి రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఇన్ బాక్స్ పిక్చర్స్ పతాకంపై సాజిద్ ఖురేషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవికి రిలీజ్ చేయనున్నారు.

జులాయి రీమేక్ గా రూపొందుతున్న సినిమాకి టోని డిసౌజ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాల్లోనూ బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా నటిస్తున్నారు. స్టార్ వారసుడి సినిమాలో తెలుగమ్మాయికి అవకాశం అంటే ఆసక్తికరం.

సికింద్రాబాద్ శివశివాని పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న అమ్రిన్ ఖురేషి ఒకేసారి రెండు హిందీ సినిమాల్లో హీరోయిన్ గా నటించడం అనేది ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. తెలుగమ్మాయి రచ్చ గెలిచి ఇంట గెలవాలన్న తపనతో ఉంది. తనకు తెలుగువారి ఆశీస్సులు ఉంటాయనే ఆశిద్దాం.