ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు మళ్ళీ నోటిఫికేషన్ పడనుందా..?

Andhra Pradesh may not be notified again for municipal elections
Andhra Pradesh may not be notified again for municipal elections

ఏపీ లో పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా.. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల ఎన్నికల కమీషనర్ మున్సిపల్ ఎన్నికల విషయంలో రకరకాల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల మార్చి 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పినారు. అంతేకాక ఓట్ల లెక్కింపు 14న జరుగుతుంది అని, మార్చి 3న నామినేషన్ల ఉపసంహరణ కి మొదటి గడువు అయితే ప్రస్తుతం హైకోర్టు లో ఈ అంశం పై పిటిషన్ దాఖలు అయింది.

కరోనా కారణంగా మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా ఎన్నికలు జరగకపోవడం తో అక్కడి నుండి ప్రక్రియ మొదలు కానుంది అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అయితే నామినేషన్ ల ప్రక్రియ సమయంలో అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు వేయనివ్వకుండా చేశారు అని, కొన్ని చోట్ల దాడులు కూడా జరిగాయి అని పలువురు తమ అభిప్రాయాలు చెప్పినారు. అయితే ఇప్పుడు అదే అంశం పై హైకోర్టు లో విచారణ జరగనుంది. అయితే 6 నెలలు మించి మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడితే మళ్ళీ రీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని న్యాయవాదులు హైకోర్టు కు విన్నవించనున్నారు. అయితే దీని పై న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.