ఎఫ్ 3 హీరోలకు స్పెషల్ డిఫెక్ట్స్ తో ట్రెండ్ సెట్ చేయబోతున్న అనిల్ రావిపూడి..

టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కలిసి ఎఫ్ 3 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎఫ్ 2 లో నటించిన హీరోయిన్లు తమన్నా, మెహారీన్ లే ఈ సినిమాలోనూ కనిపించి అలరించనున్నారు. అయితే ఈ సినిమాలో క్యారెక్టర్స్ అలాగే ఉన్నా కథ మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుందట. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎన్నో ఈవెంట్స్ లో, సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏంటంటే.. వెంకటేష్, వరుణ్ తేజ్ ల పాత్రపై ఓ అల్టిమేట్ అప్డేట్ వచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఎఫ్ 2 సినిమాలో ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో అలరించిన వెంకటేష్ ఈ సీక్వెన్స్ లో కూడా వెంకటేష్ పాత్రకు రేచీకటి ఉంటుంది. మరోవైపు వరుణ్ తేజ్ కు నత్తిగా క్రియేట్ చేశారు. ఇక వీరిద్దరూ చేసే అల్లరికి, వీరికి ఉన్న ఈ స్పెషల్ క్వాలిటీలతో ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వులు గ్యారెంటీ అని తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే పలు హీరోలకు ఇలాంటి లోపాలతో సెన్సేషన్ హిట్స్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి స్టైల్ కి ఇలాంటి లోపాలుంటే ఆ కిక్కే వేరప్పా.. అంటున్నారు ఆడియన్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.