అన్నవరంలో అన్నదానం పునరుద్ధరణ

Annavaram
Annavaram

అన్నవరం : ప్రముఖ పుణ్యక్షేత్రం
అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఉచిత అన్నదానం పధకం తిరిగి పునరుద్ధరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయంలో నిత్యాన్నదాన పథకం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆదేశించిన మీదట భక్తులకు అన్నప్రసాదాన్ని శుక్రవారం ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు ప్రారంభించారు. భక్తులకు సౌకర్యార్థం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు అన్నదానం పధకంను అందుబాటులోకి తీసుకుని వచ్చామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇంతవరకు ప్యాకెట్ల రూపంలో ప్రసాదాన్ని అందించగా, శుక్రవారం నుండి అన్నదాన భవనంలోకి భక్తులను అనుమతించారు. ఆలయ అధికారుల నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.