భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు…మరో 585 మంది మృతి!

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గినట్లే అనిపించినా, మళ్ళీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 45,576 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 89,58,484 కి చేరింది. అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉండటం చేత ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అంతేకాక వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 585 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,31,578 కి చేరింది. నిన్న ఒక్కరోజే 48,493 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. మొత్తం ఇప్పటి వరకూ దేశంలో 83,83,603 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 4,43,303 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.