ముగిసిన మరో జర్మన్ శకం !!

German Chancellor Angela Merkel
German Chancellor Angela Merkel

16ఏళ్ళ సుదీర్గ రాజకీయానికి ముగింపు పలకనున్న జర్మన్ ఛాన్సెలర్ అంగేలా మెర్కెల్.
మెర్కెల్ ఎగ్జిట్ తో జెనర్మనీ లో ఈ నెల 26న కొత్త జర్మన్ ఛాన్సలర్ కోసం ఎలక్షన్స్ జరగనున్నాయి.

మెర్కెల్ ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన కన్సర్వేటివ్ అలయన్స్ (క్రిస్టియన్ డెమోక్రటిక్(CDU) + (CSU)క్రిస్టియన్ సోషలిస్ట్)నుండి అర్మెన్ లాస్టజెట్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ (SDP) నుండి ప్రస్తుత జర్మన్ వైస్ ఛాన్సెలర్ అయిన ఓలాఫ్ స్కోల్జ్ మరియు అలయన్స్ 90/ది గ్రీన్స్ పార్టీ నుండి అన్నాలీనా బేర్బోర్క్ బరిలో ఉన్నారు.

ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పార్టీల వారీగా చూస్తే SDP పార్టీ 25% కన్సర్వేటివ్ అలయన్స్ (CDU+CSU) కు 21% మరియు ది గ్రీన్ పార్టీ కి 17% గాను లీడర్ పాపులారిటీ పోల్స్ లో SPD నుండి పోటీ చేస్తున్న స్కోల్జ్ కు 43%, కన్సర్వేటివ్ అలయన్స్ నుండి పోటీ లో ఉన్న ఆర్మెన్ కు 16% మరియు గ్రీన్స్ నుండి బరిలో ఉన్న బేబోర్క్ కు 11% గా రావడంతో జెనర్మన్ ఎలక్షన్ రసవత్తరంగా మారింది.

ఎగ్జిట్ పోల్స్ మెర్కెల్ రూలింగ్ పార్టీకి పెద్ద షాక్ కలిగించాయనే చెప్పాలి తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో మెర్కెల్ తన పార్టీకి చెందిన అర్మెన్ ను బలపరుస్తూ లెఫ్ట్ గవర్నమెంట్ జర్మనీ లో చీలికలు తెస్తుందని తెలిపారు.