మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మరో కొత్త పోస్టర్

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. అఖిల్ ఈ సినిమా పై కాస్త ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు. కాగా ఈ చిత్రంలో అఖిల్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది.

ఇప్పటికే ఈ ఇద్దరి లుక్స్ అందరినీ ఆకట్టుకోగా సంక్రాంతి సందర్భంగా మరో కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూస్తే అఖిల్, పూజాల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని మరో సారి అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.