మంచు విష్ణు మోసగాళ్లు నుంచి మరో పోస్టర్ రిలీజ్

హీరో మంచు విష్ణు ప్రస్తుతం జెఫ్రె చిన్ దర్శకత్వంలో మోసగాళ్లు సినిమా చేస్తున్నాడు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఐ టి స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లో మంచు విష్ణు తో పాటు కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు.

అయితే ఈ స్కామ్ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు ఎవరు లాభపడ్డారు అనేదే ఈ కథ. ఇప్పటికే ఈ సినిమాపై పై భారీ అంచనాలు నెలకొనగా తాజాగా సంక్రాంతి సందర్భంగా మరో పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్ పై ఈ చిత్రాన్ని మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు.