యూట్యూబ్ లో అని రికార్డ్స్ ను బ్రేక్… బన్నీ ఖాతాలో మరొకటి..!

Another record-breaking alluarjun account YouTube
Another record-breaking alluarjun account YouTube

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా గత సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయినా అలా వైకుంఠపురంలో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం అంతటి విజయం సాధించడం లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కీలక పాత్ర పోషించారని చెప్పాలి. ఈ మూవీలోని పాటలు రిలీజ్ అయినప్పటి నుండి యూట్యూబ్ లో అని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూనే వున్నాయి.

తాజాగా ఈ సినిమాలో ని రాములో రాముల పాట మరో కొత్త రికార్డును సొంతం చేసుకుంది. సౌత్ లో 300 మిలియన్ల వ్యూస్ వచ్చిన లిరికల్ వీడియో సాంగ్ గా రికార్డును నమోదుచేసింది. దీనితో ఏ ఇండస్ట్రీలోనూ ఏ హీరోకి దక్కని రికార్డు బన్నీకి దక్కింది.