స్క్రిప్ట్ ని మార్చొద్దంటూ అనుష్క సలహా!

Anushka New Movie Updates

 

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మహారాణి అనుష్క. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అందమైన రూపంగా ముద్రించుకుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ 16 ఏళ్ళు అయింది. అత్యంత సక్సెస్ ఫుల్ గా వినూతనమైన పాత్రల్లో నటించారు, హుందాగా హీరోయిన్ పాత్రలో నటించాలంటే అనుష్క రూపమే గుర్తొస్తుంది. లేడీ ఒరియెంటెడ్ పాత్రల్లో అనుష్క ఒదిగిపోయింది.

అనుష్క, స్టార్ హీరోలకు జోడీగా నటించారు. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి లాంటి హీరోయిన్ ఒరియెంటెడ్ సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించారు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ ని సాధించింది. కరోనా బ్రేక్ తర్వాత నిశ్శబ్దం సినిమా ఫ్లాప్ అయ్యింది. కాస్త బ్రేక్ తీసుకున్నాక.. సినీ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిందని రూమర్స్ వచ్చాయి.

ఈ క్రమంలో హీరోయిన్ ఒరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె పుట్టినరోజు సందర్భంగా తెలిపారు. ఈ సినిమాకి మహేష్. పి దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన మాట్లాడుతూ ఈ కథను అనుష్క కోసం అనుకోలేదని.. స్క్రిప్ట్ వినిపించినప్పుడు అనుష్క ఓకే అని చెప్పారని అన్నారు. ఆ తర్వాత కథలో కొన్ని మార్పులు చేసారట. ఈ కథను మార్చొద్దని.. అంతకుముందు చెప్పినట్లే ఉంచమని అనుష్క అన్నారట. ఆ తర్వాత స్క్రిప్ట్ లో అనుష్క సలహాలు కూడా ఇచ్చారట. అలా అనుష్క మల్టీ టాలెంట్ గురించి డైరెక్టర్ చెప్పారు.