
తిరుపతి: రాజధానిపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని స్పష్టం చేశారు. పులివెందుల కావచ్చు.. విజయవాడ కావచ్చు.. రేపు మరో ప్రాంతం కావచ్చంటూ గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియట్.. అదే రాజధాని అని కుండబద్దలు కొట్టేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మూడు రాజధానులకు సీఎం నిర్ణయం తీసుకున్నారు, దానికి తామంతా కట్టుబడి ఉన్నామని మంత్రి గౌతమ్‌రెడ్డి అన్నారు.