బాబు రాజకీయ బహిష్కారం – సకల సమస్యలకు పరిష్కారం: సుందరరామ శర్మ

Babu's political boycott - the solution to all problems: Sundara rama Sharma

 

21.10.2021 గురువారము నాడు విజయ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి చిల్డ్రన్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా మరియు “అవర్ స్టేట్ అవర్ లీడర్” “వైయస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం” సంయుక్త సారధ్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు జి శాంతమూర్తి ఆధ్వర్యంలో “సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం” బ్యానర్ పై జగన్ గారి పై పట్టాభి అనుచిత వ్యాఖ్యల ఖండన సందర్భాన్ని పురస్కరించుకొని వ్యక్తిత్వ వికాసం – భాషా వికాసం శీర్షికన రాజకీయ ఔన్నత్యాన్ని చాటడంలో భాష ప్రాధాన్యత అనే అంశంపై సామాజిక కార్యకర్త కోపల్లి జయకర్ బాబు అనుసంధాన కర్తగా తెలుగు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ముఖ్యఅతిథిగా రైతు నాయకులు త్రినాద్ రెడ్డి ప్రముఖ వైద్యులు వైయస్ థామస్ రెడ్డి వైకాపా నాయకులు రాజకీయ విశ్లేషకులు సుందరరామ శర్మ విశిష్ట అతిథులుగా వెబినార్ నిర్వహించారు.

చిల్డ్రన్ స్పేస్ క్లబ్ క్లబ్ అధ్యక్షుడు శాంతమూర్తి తన స్వాగతోపన్యాసంలో భాష భావాన్ని ప్రకటించడానికి గాని ఎదుటి వారి మనోభావాలను దెబ్బ తీయడానికి కాదని అభిప్రాయపడ్డారు.

తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ప్రత్యర్థుల వ్యక్తిత్వాలను కించపరుస్తూ రాజకీయ లబ్ది పొందే నీచ రాజకీయ వ్యాఖ్యాన సంస్కృతికి మూల పురుషుడు చంద్రబాబు అన్నారు. తనపై ఎంతటి బురద చల్లినా సానుభూతి కోసం తనపై తాను చేయించుకున్న అలిపిరి ఘటనలో గాయపడిన చంద్రబాబును పరామర్శించిన వైయస్ కు ఉన్న సంస్కారం చంద్రబాబుకు లేదన్నారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారగల చంద్రబాబు మనస్తత్వాన్ని దుయ్యబట్టారు.

గోబెల్స్ తో సైతం నోబెల్ ప్రైస్ కొరకు పోరాడి ఆ పతకాన్ని సైతం గోబెల్స్ కు దక్కకుండా కొనుక్కో గలిగిన విచిత్ర మనస్తత్వం చంద్రబాబుదన్నారు రైతు సంఘం నాయకులు కొవ్వూరు త్రినాద్ రెడ్డి.

రాజకీయ పాపర్ ని పాపులర్ చేసిన న్యూస్ పేపర్ లే చంద్రబాబు ఆయువు పట్టని… చంద్రబాబుకు ఉన్న ప్రచార ప్రసార యావను దూరం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ యవనిక నుండి చంద్రబాబును బహిష్కరించడమే సమాజంలో తలెత్తుతున్న అనేక సామాజిక రుగ్మతలకు పరిష్కారం అంటూ వ్యాఖ్యానించారు రాజకీయ విశ్లేషకులు సుందరరామ శర్మ.

ఇంత చిన్న వయసులో అంత సహనాన్ని పాటిస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్థితప్రజ్ఞతను మెచ్చుకుంటూ వ్యక్తిత్వ హననమే ప్రధాన ఆయుధంగా ప్రత్యర్థులను ఆత్మరక్షణ లోనికి నెట్టి మనుగడ సాగిస్తున్న చంద్రబాబును యుక్తిగా ఎదుర్కోవాలని అందుకు మేధావుల ఫోరం చక్కని వేదిక కావాలని డాక్టర్ వైయస్ థామస్ రెడ్డి సూచించారు.

ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ పార్వతీశం మాట్లాడుతూ అనైతిక రాజకీయానికి చంద్రబాబు ట్రేడ్మార్క్ అన్నారు విద్యావేత్త గునుపూరు రతన్ రాజు మాట్లాడుతూ యువతను వనరులను సమ్మిళితం చేయడం ద్వారా లంపెన్ గ్యాంగ్లను నిర్మూలించి పెడత్రోవ పట్టిన యువతకు ఉపాధి కల్పన చేయడం ద్వారా ఇటువంటి రాజకీయాలను అడ్డుకోవాలన్నారు. డిసిసిబి డిప్యూటీ జీఎం అజయ్ కిషోర్ మాట్లాడుతూ మహిళలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ద్వాక్రా గ్రూప్ లా వడ్డీ శాతాన్ని తగ్గింపు ద్వారా మహిళా ఓటు ను శాశ్వతం చేసుకోవచ్చన్నారు.

కాపిరెడ్డి కృష్ణారెడ్డి చక్కని కవిత్వంతో ఆహుతులను అలరించగా అనుసంధాన కర్తగా వ్యవహరించిన కోపల్లి జయకర్ బాబు నేటి ప్రతిపక్షానికి అయినా ప్రభుత్వానికైనా నిరసన తెలపడం లో తరిమెల నాగిరెడ్డి ఆదర్శంగా ఉండాలని విద్వేష రాజకీయాలకు స్వస్తి పలకాలని ఎదుటి వారి అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నగేష్ బాబు, సుధాకర్ రెడ్డి,ఈషూ, మానవతా కోకన్వీనర్ సలీం మాలిక్, సైన్సు ఉపాధ్యాయులు వానపల్లి రమేష్, వేణుగోపాల్ రెడ్డి , కోటిలింగరెడ్డి, కేసర కోటిరెడ్డి మరియు చిల్డ్రన్స్ స్పేస్ క్లబ్ సభ్యులు అవర్ స్టేట్ అవర్ లీడర్, వైయస్సార్ ఇంటలెక్చువల్ ఫోరమ్ సభ్యులు తమతమ అభిప్రాయాలను పంచుకున్న అనంతరం వందేమాతరగీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం జాతీయగీతంతో ముగిసింది.