ఏంటో తెగ కలిసొచ్చేస్తోంది

Bad Sales Good Time for Jagan

 

ఆస్తి ఎవడిదో…అమ్మేది ఎవడికో..కొనేది ఎవడో…జస్ట్ సబ్ రిజిస్ట్రార్ లా సంతకం చేసేసి…రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కన్నా ఎక్కువ లాభం పొందితే..ఆ కిక్కే వేరు కదా. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు వెనక్కొచ్చినట్లు.. పేషెంట్ కు ఆగిపోయిన ఆక్సిజన్ మళ్లీ ఫుల్లుగా వచ్చినట్లు.. చేసేది తప్పు అయినా సరే.. అందరూ అడగకుండా సైలెంటుగా ఉన్నప్పుడు.. అసలు బాధితులు కిమ్మనకుండా బ్యాంక్ అకౌంట్లు చూసుకుంటున్నప్పుడు.. కలిగే ఆనందం.. నిజంగా సూపరహే. ఆ ఆనందమంతా దక్కించుకునే అదృష్టం జగన్ దే.

జగనన్నకు ఈ మధ్య తెగ కలిసొచ్చేస్తుంది. ఒకవైపు ప్రతిపక్షం బహిష్కరణ అంటూ విజయాలను పళ్లెంలో పెట్టి అందించేస్తోంది. మరోవైపు కేంద్రం కరోనాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతుంటే.. ఆ సంస్కరణలు అలా వాడుకోవడానికి అవకాశం వచ్చేస్తోంది. మరోవైపు మోదీ సాబ్ ఫ్రెండ్ డీల్స్ కు ముందుకొస్తుంటే..మోదీ సార్ వచ్చి నరుడా ఏమి నీ కోరిక అడిగినట్లే ఫీలింగ్ వచ్చేస్తోంది. ఓట్ల కోసం పథకాలు.. పథకాల కోసం నిధులు.. ఆ తర్వాత అప్పులు.. ఇప్పుడు అప్పులు కూడా దొరకడం కష్టమైపోయిన వేళ.. సముద్రుడు జగనన్నకు ఏదో బాకీ ఉన్నట్లే కోఆపరేట్ చేస్తున్నాడు.

ఇప్పటికే గంగవరం పోర్టును నరేంద్ర మోదీ ఖాస్ దోస్త్ అదానీకి అప్పచెప్పి 645 కోట్లు ఖజానాలో వేసుకున్నారు. ఇదంతా అఫిషీయల్ .. మరి ఇంటర్నల్ డీల్స్ ఏంటో తెలియదు మనకి. ఇప్పుడు బందరు పోర్టు మీద కూడా డిస్కషన్ నడుస్తోంది. త్వరలోనే ఆ డీల్ కూడా సెట్ అయిపోతుంది. పైగా ఎయిర్ పోర్టులు కూడా ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం చాలా స్పీడుగా స్టెప్పులేస్తోంది. దానిని కూడా వరంలా మార్చుకునే ఛాన్స్ ఉంది మన సీఎంకి. ఏ డబ్బులు లేవనుకుంటే.. ఇలా డబ్బులొస్తుంటే మరి కలిసొచ్చినట్లే కదా.

పైగా వీటిపై తెలుగుదేశం ఏమీ మాట్లాడదు. ఎందుకంటే అదానీ అంటే మోదీతో సమానం.. అందుకనే నోరు లేచే దమ్ము లేకపోవచ్చు వారికి. ఇక కాంగ్రెస్ కూడా గతంలో ప్రైవేటు రథం ఎక్కినోళ్లే. అందుకని వారేమీ మాట్లాడరు. ఇక మిగిలేది ఎర్రమల్లెలు బ్యాచ్ మాత్రమే.. వీరికి వాయిస్ ఉంది గాని.. బలం లేదు.. కాబట్టి నో ప్రాబ్లెమ్.

ఇక ఇలాంటి డీల్స్ సెట్ అయితే.. మరో ఏడాది పాటు డబ్బులకు ఢోకా లేనట్లే జగన్ ప్రభుత్వానికి. ఇప్పటికే పరిషత్ ఎన్నికల ఫలితాలతో ఊపుమీదున్న వైసీపీ.. ఈ డీల్స్ తో ఇంకా ఊపు పెరిగిపోతుందనడంలో సందేహం లేదు. కాకపోతే ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు… ప్రకృతిపరంగా వచ్చిన ఇలాంటి ఆస్తులను అలా అమ్మేస్తున్నారు. పైగా అదానీ ట్రాక్ రికార్డు ఏమీ బాగోదు. బ్యాంకులను లోన్లు ఎగ్గొట్టడం… తప్పించుకోవడం..మోదీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని..వ్యాపారం చేసుకోవడమే వారి రికార్డు. అలాంటివాళ్లకు పోర్టులను డెడ్ చీపుగా అప్పచెప్పేస్తున్నారు. ప్రజల ఆస్తులను అలా అప్పనంగా అప్పగించేస్తున్నారు.

దీనిని అడిగే పరిస్ధితిలో ప్రజలు మాత్రం లేరు. ఎందుకంటే వారు చాలా బిజీగా ఉన్నారు. వారు జీవితం వాళ్లు గడపటమే వారికి తెలుసు. వారికి ఆదాయం ఎలా… ఖర్చులు ఎలా.. తమ పిల్లలు ఇలా సంసారంలో ఈదడమే తెలుసు. ఇవన్నీ పట్టించుకునే తీరిక ఉండదు కదా. పాపం వాళ్ల లైఫ్ వాళ్లకే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తారు. రేపు ఇలా చేయటం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుంది.. ఒక్కసారే పేమెంట్.. అవన్నీ ఉన్న ఖర్చులకు సరిపోతాయి.. మళ్లీ ఖర్చులకు కావాలంటే.. ఎన్ననీ అమ్ముతారు ఎన్నాళ్లు అమ్ముతారు.. అప్పుడు పథకాల్లో కోత పెట్టడం… కరెంటు బిల్లులు పెంచడం… ఇంటి పన్నులు వేయడం.. ఇలా రకరకాలుగా కనపడకుండా కుమ్మేస్తారు.. అప్పుడు మాత్రం అవన్నీ కరెక్టు కాదని ఆక్రోశిస్తారు… గతంలో నిర్ణయాల వల్లే… మనకు ఇప్పుడు స్ట్రోక్ తగిలిందని తెలుసుకోరు.. మనం మాత్రం ఏం చేయలేం…జగనన్నకు కంగ్రాట్స్ చెప్పడం తప్ప.