కొరటాల శివ, బాలకృష్ణ కాంబినేషన్ లో అద్దిరిపోయే ప్రాజెక్ట్..

 Balakrishna New Movie Updates

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాలో నటించారు. ఈ సినిమా వచ్చే నెల 2 వ తేదీన రిలీజ్ చేయాలని ఫిల్మ్ టీమ్ తెలిపింది. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ని కూడా బాలయ్య లైన్ లో పెట్టారు. నెక్ట్స్ సినిమాను కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రచయితగా ఉన్నప్పుడే ఈ కథను కొరటాల శివ బాలకృష్ణకు వినిపించారట. ఇప్పుడు ఈ కథను సినిమాగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.

ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ తో కలిసి ఆచార్య సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాను మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే కొరటాల శివ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో సినిమాను ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ తో కలిసి చేయబోయే సినిమా తర్వాత కొరటాల శివ, బాలకృష్ణతో ఆయన రేంజ్ కు తగ్గట్లుగా డిజైన్ చేశారు. తాను రాసుకున్న కథకు పూర్తి స్థాయి న్యాయం జరగాలంటే అది బాలయ్యే అని కొరటాల స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నారు. మరి ఈ సినిమాపై మరిన్ని అప్డేట్స్ తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

బాలకృష్ణ ఇమేజ్ కు తగ్గట్లుగా ఉండే ఈ సినిమా యాక్షన్ కమర్షియల్ మూవీనా లేదా.. పీరియాడికల్ కథతో తెరకెక్కుతుందా.. అనే విషయం తెలియాలి. ఏది ఏమైనా బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.