వంద కిలోమీటర్లు నడిచిన బండి

Bandi Sanjay News In Telugu

 

తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని శపధం చేసిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్… ఆ దిశగా ఇప్పటికే వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మెగా ప్లాన్ రూపొందించారు.

తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ పది రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో కొనసాగుతోంది.‌

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట వద్దకు చేరుకున్న పాదయాత్ర వంద కిలోమీటర్ల మైలు రాయి పూర్తి చేసుకుంది. దీంతో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో భారీఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కాషాయ బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. అలాగే వంద కేజీల భారీ కేక్ ను బండి సంజయ్ తో కట్ చేయించారు బీజేపీ కార్యకర్తలు. పాదయాత్ర నిరాటంకంగా సాగుతోందని బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.