ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి బండ్ల ఔట్‌

Maa PrakashRaj

 

హైదరాబాద్‌: ప్రకాష్‌రాజ్‌ టీమ్‌ నుంచి బండ్ల గణేష్‌ బయటకు వచ్చారు. అయితే ‘మా’ ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీగా బండ్ల పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌కు ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నారు. తన మనస్సాక్షి చెప్పినట్లే చేస్తానంటున్నారు. ఒక్క అవకాశం ఇస్తే తానేంటో చూపిస్తానని బండ్ల గణేష్‌ చెబుతున్నారు. పేద కళాకారులకు డబుల్
బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడమే తన ధ్వేయమని, దాని కోసం పోరాడి వారి సొంతింటి కల నిజం చేస్తానంటున్నారు. ఇప్పుడు పదవుల్లో ఉన్నవారు రెండేళ్లుగా ఏం చేయలేదని బండ్ల విమర్శలు చేశారు. గొడవలతో ఇంతకాలం ‘మా’ సభ్యులను మోసం చేసింది చాలని ఇకనైనా పేద కళాకారుల కలలను నిజం చేద్దామని ఆయన అంటున్నారు.