27 న అసెంబ్లీ హాల్లో బి.సి.సంక్షేమ కమిటీ సమావేశం

BC Welfare Committee meeting in Assembly Hall on 27th

 

  • రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో సమావేశం

అమరావతి : రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ సమావేశం అమరావతిలోని సచివాలయం అసెంబ్లీ హాల్ లో ఈ నెల 27 బుధవారం ఉదయం 11.00 గంటల నుండి జరుగనున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. వెనుబడిన తరగతుల సంక్షేమానికై ప్రభుత్వం అమలు చేస్తున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాలసీని సమీక్షించేందుకు ఈ కమిటీ ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.సి. విద్యార్థులకు రిజర్వేషన్ అమలు మరియు మూడు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుచేస్తున్న తీరును ఈ కమిటీ సమీక్షించనుంది.