భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2021-22

BCCI Latest News Today

 

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2021-22 సీజన్‌లో 1054 దేశీయ మ్యాచ్‌లను నిర్వహిస్తుంది. ఇటీవల కలిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది, BCCI ఈ సీజన్‌లో అత్యధికముగా 13 టోర్నమెంట్‌లను నిర్వహించనున్నట్లు పేర్కొంది.కోవిడ్ కారణంగా గత సీజన్‌లో BCCI దేశీయ క్రికెట్‌లో చాలా పరిమిత మొత్తాన్ని నిర్వహించగలిగింది. ప్రస్తుత సీజన్‌లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది మరియు దేశంలో టీకా ప్రక్రియ కూడా ఫుల్ స్వింగ్ లో ఉండటం తో ఈ సారి టోర్నమెంట్ మధ్య అంతరాయలు ఉండవని బోర్డు భావిస్తోంది.

కోవిడ్ ప్రూఫ్ బయో-సురక్షిత వాతావరణాన్ని సృష్టించేందుకు బోర్డు అపోలో హాస్పిటల్స్‌తో జతకట్టనుంది. దీనికోసం ప్రతి నగరంలో కనీసం 220 గదులతో కూడిన 75 హోటళ్లలో బయో-సెక్యూర్ బుడగలు సృష్టించబడుతాయని BCCI అధికారి తెలిపారు.

బిసిసిఐ యొక్క దేశీయ సీజన్ భారత క్రికెట్‌కు వెన్నెముకలాంటిది వేలాది మంది ఆటగాళ్లు వివిధ టోర్నమెంట్‌లు మరియు ఏజ్ గ్రూప్‌లో ఆడతారు. ఇది దేశీయ క్రికెట్ భారత జట్టుకు ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుంది.

ఈ సీజన్‌లో నిర్వహించబడే టోర్నమెంట్లు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీ, పురుషుల స్టేట్ వన్డే, కల్నల్ సికె నాయుడు ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీ, పురుషుల U19 వన్డే ఛాలెంజర్, కూచ్ బెహర్ ట్రోఫీ, సీనియర్ మహిళల టీ 20 లీగ్, సీనియర్ మహిళల వన్ డే లీగ్, సీనియర్ మహిళల వన్ డే ఛాలెంజర్ ట్రోఫీ, మహిళల U19 వన్ డే లీగ్ మరియు మహిళల U19 వన్ డే ఛాలెంజర్ ట్రోఫీ.