బీసీసీఐ తర్జన బర్జన !!!

BCCI Latest News

 

ఇండియా – ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ కోవిడ్ కారణాలతో రద్దు అయిన విషయం తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్ ఆగిపోవడం తో సీరిస్ విజయం ఎవరిదనేది గందరగోళం లో పడింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియంషిప్ పాయింట్ సిస్టమ్ వల్ల ప్రతీ టెస్ట్ ఆడటం ఇరు జట్లకు అత్యవసరం అయ్యింది.
కానీ ప్రస్తుత ఇరు జట్ల బిజీ షెడ్యూల్ కారనంగా ఈ మ్యాచ్ ఇప్పట్లో జరిగేలాలేదు.

ఇంగ్లాండ్ – ఇండియా మధ్య జరగనున్న లిమిటెడ్ ఓవర్స్ సిరీస్ జరగనుంది ఆ సమయం లో ఈ టెస్ట్ ను నిర్వహించాలని బీసీసీఐ బావిస్తుంది.

ఇప్పటికే ఇండియన్ ప్లేయర్స్ ఐపీల్ కోసం ఒక్కొక్కరిగా దుబాయ్ చేరుకుంటున్నారు. ముంబై ప్లేయర్స్ (రోహిత్ శర్మ , సూర్య కుమార్ యాదవ్, జాస్ప్రిత్ బుమ్రా )ఇప్పటికే చార్టెడ్ ఫ్లైట్స్ రూపం లో దుబాయ్ చేరారు. ముందు అనుకున్న దాని ప్రకారం సెప్టెంబర్ 15న ఇంగ్లాండ్ నుండి బయలుదేరాల్సి ఉండగా 5వ టెస్ట్ రద్దు కారణంగా అందరు ముందుగానే దుబాయ్ చేరుతున్నారు.