నల్ల ద్రాక్షలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?

Benefits of Black Grapes

 

చాలామంది గ్రేప్స్ తినడానికి పెద్దగా ఇష్టపడరు. స్వీట్ గా ఉంటే తింటారు.. కానీ ఏమాత్రం పులుపు ఉన్నా వద్దు అని పక్కన పెట్టేస్తారు. అయితే వైట్ గ్రేప్స్ కంటే.. నల్ల ద్రాక్ష వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నల్ల ద్రాక్షలో సీ-విటమిన్‌, ఏ-విటమిన్, బీ6, ఫోలిక్‌ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ద్రాక్ష పండ్లలో ఉండే గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడేందుకు ఉపయోగపడతాయి.

ద్రాక్షలో ప్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి. నల్లటి ద్రాక్షలు రక్తంలో నైట్రిన్‌ ఆక్సైడ్‌ మోతాదును పెంచుతాయి. నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా అడ్డుకుంటుంది. గుండెపోటు నివారణకు దోహదపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
జీవక్రియలు సాఫీగా సాగేందుకు ఇవి దోహదం చేస్తాయి. బాడీలో గ్లూకోజ్‌ లెవల్స్‌ను స్థిరీకరించే శక్తి కూడా ద్రాక్ష పళ్లకు ఉంది.

ఫ్యాట్‌ కంటెంట్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాల్సి వచ్చిన రోజు.. అరకప్పు ద్రాక్ష తీసుకుంటే మంచిది. అనవసరపు కొవ్వులను కరిగించి, కొలెస్టరాల్ లెవల్స్‌ను క్రమబద్ధీకరిస్తాయి. మైగ్రేన్, డిమెనియా, అల్జీమర్ వ్యాధిని రాకుండా చేయటంలో నల్ల ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ మ్యూటజెనిక్, యాంటీ ఆక్సీడెంట్ ప్రాపర్టీస్ సమృద్ధిగా ఉంటాయి. దీనితో బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లను రాకుండా ఇది కాపాడుతుంది. మంచి కంటి చూపు కావాలంటే బ్లాక్ గ్రేప్స్ ని రెగ్యులర్ గా తీసుకోవాలి.

నల్ల ద్రాక్షలో ఉండే కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. నల్లద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్‌ గుండెలో పేరుకొనే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి అక్కడి కండరాలకు మేలుచేస్తాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల షుగర్ ని కంట్రోల్ చేయవచ్చు. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఏకాగ్రతతో పాటు జ్ఞాపకశక్తి కూడా మెరుగు పడుతుంది.