వాల్ నట్ లను నానబెట్టి తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా?

benefits of eating soaked walnuts

 

వాల్‌నట్స్ మనిషి మెదడు ఆకారంలో ఉంటాయి. వాల్‌ నట్‌ లను నానబెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. నిజానికి నట్స్, సీడ్స్ లో కొన్ని ఎంజైమ్‌ లు ఉంటాయి. ఈ ఎంజైమ్ లను పచ్చిగా జీర్ణం చేయడం కష్టం కాబట్టి వీటిని నానబెట్టడం వల్ల చక్కగా జీర్ణమవుతాయి. దీనివల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అన్నీ వెంటనే అందుతాయి. అంతేకాదు వాల్ నట్స్ వంటి నట్స్ తినడం వల్ల నానబెట్టి తినడం వల్ల వాటిలోని పోషకవిలువలు తగ్గిపోవని, వాటి వల్ల పొందే లాభాల్లో ఏమాత్రం తేడా రాదని తేలింది. ఇవి డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలో బాగా పనిచేస్తాయి. మెదడు చురుకుగా ఉండటానికి వాల్ నట్స్ ఉపయోగపడతాయి.

నానబెట్టిన వాల్‌నట్స్లో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అందుకే వాల్నట్స్ను బ్రెయిన్ ఫుడ్ గా చెబుతారు. వాల్‌నట్స్లో కాల్షియం, పొటాషియం, ఐరన్, రాగి, జింక్‌ వంటి పోషకాలు నిండి ఉంటాయి. నానబెట్టిన వాల్‌నట్స్ జీవక్రియను పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. బరువు తగ్గించడంలో ఇవి మరింత సహాయపడతాయి.

ప్రతిరోజూ నానబెట్టిన వాల్‌నట్‌లను తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను కంట్రోల్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. రక్తంలో చక్కెరను శరీరంలోకి విడుదల చేయడాన్ని తగ్గిస్తాయి. ఇది హానికరమైన చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చూస్తాయి. అలాగే, నానబెట్టిన వాల్‌నట్‌లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 15 మాత్రమే ఉంటుంది. వాల్‌నట్‌లు ఇన్సులిన్ నిరోధకతను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ సహాయపడతాయని తేలింది.

ఇవే కాకుండా, వాల్‌నట్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మానికి, జుట్టుకు మేలు చేసే సహజ నూనెలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వాల్‌నట్స్ కడుపులో, గుండెలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు డైలీ వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.