లెమన్ వాటర్ ఏ టైమ్ లో తాగాలో తెలుసా?

Best Time to Drink lemon water

 

చాలామంది బరువు తగ్గాలనో, ఇమ్యూనిటీ పెంచుకోవాలనో ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతారు. అయితే ఉదయం పరగడుపున కాకుండా రాత్రి సమయంలో నిమ్మరసం తాగితే ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదికూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కాసింత నిమ్మరసం కలుపుకొని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలే వేరంటున్నారు.

రాత్రి పడుకున్న తర్వాత ఏడు గంటల పాటు ఏమీ తీసుకోము. దీనివల్ల శరీరం డీ హైడ్రేట్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు నిమ్మరసం తీసుకుంటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. చర్మం ఎండి పోకుండా తేమగా ఉండడంలో నిమ్మరసం క్రీయాశీలకంగా పనిచేస్తుంది.
బరువు తగ్గాలనుకుంటున్నవారు కూడా.. రాత్రి పడుకునే ముందు కాస్త నిమ్మరసం తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. షుగర్ లేకుండా నిమ్మరసం తాగడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గించుకోవచ్చు.

జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్నవారు కూడా రాత్రి పడుకునే ముందు నిమ్మరసం తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ రేటు మెరుగు పడుతుంది.చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. అలాంటివారు పడుకునే ముందు నిమ్మరసం తాగి పడుకుంటే ఉదయం లేవగానే వేధించే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. నిమ్మరసం ఒక మంచి నేచురల్‌ మౌత్‌ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది.

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతోన్న వారు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ కాల్షియంతో కూడిన రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

సో ఉదయం పూట లెమన్ వాటర్ తాగేవాళ్లు ఈ అలవాటు మార్చుకుని రాత్రి పడుకునే ముందు తాగితే మంచిది. విటమిన్ సి పుష్కలగా అందడంతో పాటు పైన చెప్పిన అన్ని బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. నిమ్మరసాన్ని రాత్రి పూటే కాకుండా వీలయినప్పుడల్లా తీసుకోవడం కూడా మంచిదే.. కాకపోతే పడుకునే ముందు తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.