భీమ్లా నాయక్ నుండి రానా టీజర్ కు డేట్ ఫిక్స్..

Bheemla Nayak Rana Teaser Launch Date

 

టాలీవుడ్ పవర్ హీరో పవన్ కళ్యాణ్, రానా లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్. మలయాళం ఒరిజినల్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కి తెలుగు రీమేక్. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ టీజర్ ను ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేయడంతో ఓ రేంజ్ పాపులారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో పలు రికార్డ్స్ ని బ్రేక్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. యూట్యూబ్ లో వన్ ఆన్ ట్రెండింగ్ లో పవన్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ నిలిచాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ నాన్ స్టాప్ హంగామా చేసుకుంటున్నారు.

ఈ సినిమాలో మల్టీ స్టారర్ గా పవన్, రానా లు యాక్ట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో పవన్ తో పాటు రానాకు సమానమైన పాత్ర, నిడివి ఇవ్వలేదని పలు వార్తలు వచ్చాయి. దీంతో రానా పాత్ర కూడా ఈ సినిమా కీలకం అని ఫిల్మ్ టీమ్ తెలిపింది. రానా పాత్రకు సంబంధించిన టీజర్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రస్తుతం డేట్ కూడా చెప్పేసింది.

ఈనెల 17 న రానా టీజర్ ను రిలీజ్ చేస్తామని అన్నారు. ఈ టీజర్ కూడా ఓ రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఇద్దరి వ్యక్తుల మధ్య హోరాహోరీగా సాగే కథ. పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యామీనన్, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ లు నటిస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక ఈ సినిమా పవన్, రానా అభిమానులకు బిగ్గెస్ట్ సినిమాగా అంచనాలు నెలకొంటున్నాయి. రానా క్యారెక్టర్ కూడా ఎక్కడా తక్కువ కాకుండా తెరకెక్కించామని ఫిల్మ్ టీమ్ భరోసా ఇచ్చారు.