ఈ వారం ఎలిమినేట్ అయ్యేది సరయు..

Bigg Boss 5 Telugu First Week Elimination

 

ఫస్ట్ వీకెండ్ ఎలిమేనేషన్ లో భాగంగా హమీదా సేఫ్ అని నాగార్జున ప్రకటించారు. ఇక మిగిలిన కాజల్, సరయు, జెస్సీ, మానస్ లో ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది సరయు అని గట్టిగా తెలుస్తుంది. ఎందుకంటే సరయునే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది అంటూ ఇంట్లో సభ్యులతో పాటు సోషల్ మీడియాలో సైతం వార్తలు వినిపిస్తున్నారు. అందులోనూ సరయు, నాగ్ తో డేట్ కి వెళ్దామని అడిగితే, నువ్వు బయటకు రాగానే వెళ్దాం అంటూ పరోక్షంగా హింట్ ఇచ్చారు. అంతేకాకుండా సరయు బూతులు హౌస్ లో ఎందుకు వినిపించడం లేదన్నారు నాగార్జున. దానికి సరయు నేను బూతులు మాట్లాడితే మీరేమైనా తిడతారేమోనని.. ఇకపై చూడండి అంటూ తన స్టైల్ లో చెబుతుంది. ఇది బిగ్ బాస్ హౌస్ నీలా నువ్వుండాలని.. ఇక నుండి హౌస్ లో బూతులు మాట్లాడాలంటూ ఇన్ డైరెక్ట్ నాగ్ అన్నారు.