బిగ్ బాస్ 4వ ఎపిసోడ్ లో రవి ఓవర్ యాక్టింగ్.. లోబో సూపర్ యాక్టింగ్..

Bigg Boss 5 Telugu Latest News

 

సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ సీజన్ 5లో నాల్గవ ఎపిసోడ్ తో యుద్ధాలు, ఏడుపులు, గొడవలు మొదలయ్యాయి. అనీ మాస్టర్, జెస్సీల గొడవతో జెస్సీ కాస్త ఎక్కువే ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తుంది. అందుకే అనీ మాస్టర్ కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ కోరడంతో.. అనీ మాస్టర్ కూడా రియలైజ్ అయ్యి ఇద్దరూ కలిసిపోయారు. కాజల్ కి ఇంట్లో వాళ్ళంతా పడుకున్నాకే నిద్రపోవాలనే శిక్ష ఉండటంతో ఇంట్లో అందర్ని కన్విన్స్ చేసే పనిలో ఉంది. లహరి, హమీదాలు తాము నిద్రపోయేదే లేదంటూ గొడవకు దిగింది. అలా హమీదా, లహరి రాత్రంతా నిద్రపోకుండా కాజల్ ని ఇరిటేట్ చేశారు.

కిచెన్ లో ప్రియా, కాజల్ కు మధ్య పాత్రలు క్లీన్ చేసే విషయంలో చిన్న ఆర్గ్యూమెంట్ జరిగింది. తనకు ఇంట్లో కూడా గిన్నెలు క్లీన్ చేయడం నచ్చదని అందుకే తాను వంట మాత్రమే చేస్తానని అనడంతో, ప్రియ తను కూడా ఇంట్లో క్లీన్ చేయనని కానీ ఇక్కడ అందరూ అన్నీ పనులు చేసుకోవాలని అంటుంది. బంగాళదుంప కర్రీని తాను అడిగినప్పుడు లేదని చెప్పి, తర్వాత ఫ్రిడ్జ్ లో ఎవరు దాచిపెట్టారంటూ ఫైర్ అయ్యింది ఉమాదేవి. అనీ మాస్టర్ పెట్టారని ప్రియ అనడంతో ఆ గొడవ ఇంకాస్త ఎక్కువైంది. ఇంతలో నటరాజ్ మాస్టర్ వచ్చి ఉమాదేవికి ఆలూ కర్రీ ఇవ్వండి అంటూ అరిచాడు. నేను అడిగినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వడానికి నేనేం బిక్షం ఎత్తుకోవడం లేదని, తినడానికి రాలేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఉమాదేవి. ఈ విషయంపై అనీ మాస్టర్ వచ్చి వివరణ ఇచ్చి అలా చేయడం తప్పేనని అనడంతో ఉమాదేవి శాంతించింది.

ఇక అందరి కన్నా సిరి పవర్ రూమ్ బటన్ ను మొదటగా ప్రెస్ చేయడంతో బిగ్ బాస్, సిరిని ఇద్దరి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుని వారిలో ఒకరు పని మనిషి గెటప్, మరొకరు యాజమాని గెటప్ వేయించాలని టాస్క్ ఇచ్చారు. సిరి షణ్ముక్ ని, లోబోని సెలెక్ట్ చేసుకుంది. దీంతో షణ్ముక్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఇమిటేట్ చేయాలని చెప్పాడు. లోబో ప్రియాంకలా నడుస్తూ.. ఆమెలా వంట చేస్తూ యాక్ట్ చేసాడు. శ్రీ రామచంద్ర, మానస్ లు ప్రియాంక కు ఎలా సైట్ కొడతారనేది రవి, విశ్వలు చేసి చూపించారు. పర్టిక్యులర్ గా రవి, మానస్ ని ఎలా ప్రియాంకకు లైన్ వేస్తాడో ఓవర్ గా యాక్ట్ చేయడంతో మానస్ హర్ట్ అయ్యి రవి మీద ఫైర్ అయ్యారు. ఎందుకు ప్రతీ విషయాన్ని అలా చూస్తారని, ప్రియాంక మంచిదని, తనంటే ఓ ఆరాధనాభావం ఉందని అంతకుమించి మిగతావాళ్ళు అనుకుంటున్నట్లు ఏం లేదని అన్నారు.