బిగ్ బాస్ సీజన్ 5 : కెప్టెన్సీ టాస్క్ లో కష్టపడిన వారికే కత్తిపోట్లు!

Bigg Boss 5 Telugu Latest Updates

 

బిగ్ బాస్ సీజన్ 5 అప్డేట్స్ లో గెలవాలంటే తగ్గాలంతే టాస్క్ కంటిన్యూ చేస్తూనే.. చిక్కులో చిక్కుకోకు అని మరో టాస్క్ ని ప్రవేశపెట్టిన బిగ్ బాస్ జేజేలు పలుకుతూ.. మన కంటెస్టెంట్స్ రంగంలోకి దిగారు. చిక్కుల్లో ఉన్న ఆరు తాడుల్ని ఎవరైతే మొదట చిక్కుల్ని తీస్తారో వారే విన్నర్స్ గా ప్రకటిస్తారని అన్నారు. ఈ టాస్క్ లో శ్వేత, అనీ మాస్టర్ లు విన్నర్స్ గా నిలిచారు. గెలవాలంటే తగ్గాలి టాస్క్ లో సన్నీ, మానస్ లు అత్యధికంగా వెయిట్ తగ్గి శభాష్ అనిపించుకున్నారు. ఇక రెండు రోజుల్లోనే 6 కిలోలు తగ్గి బక్కచిక్కిన మానస్ రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే చివరికి డెడికేషన్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సన్నీని తొక్కిపడేసారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక షణ్ముక్ మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నట్లు.. తన గేమ్ ని సిరినే హ్యాండిల్ చేస్తుందనే విషయం ఈ ఎపిసోడ్ లో ప్రేక్షకులకు కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది గానీ ఆ విషయం ఇంకా షణ్ముక్ కే అర్థం కావడం లేదు. ఇక కెప్టెన్సీ పోటీకి సన్నీ, శ్వేతా, శ్రీరామ్ లను ఫైనల్ గా నుంచోపెట్టడం.. వారి వారి ప్రామిస్ లను చెప్పడంతో కంటెస్టెంట్స్ వారి వారి రీజన్స్ ని చెప్పి కత్తితో పొడిచి మరీ అవుట్ చేయాలనే నియమం పెట్టాడు బిగ్ బాస్. అప్పటివరకు ఎంతో కష్టంతో తిండి తిప్పలు మానేసి మరీ పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఎవరికి అయితే ఎక్కువగా కత్తి పోట్లు వస్తాయో వాళ్ళు కెప్టెన్స్ టాస్క్ లో ఉండలేరని, ఎవరికి అయితే తక్కువ కత్తులు వస్తాయో వాళ్ళే కెప్టెన్ అంటూ అనౌన్స్ చేశారు.

సన్నీ కి హౌస్ మేట్స్ అందరూ రివర్స్ అయిపోయి మరీ విపరీతమైన కత్తిపోట్లతో ఓడించారు. కంటెస్టెంట్స్ ఒక్కోక్కరూ ఒక్కో రీజన్ తో సన్నీని టార్గెట్ చేశారు. నటరాజ్ మాస్టర్, ప్రియాంక, మానస్ లు శ్వేతాని టార్గెట్ చేశారు. కాజల్ ఇంకాస్త కన్నింగ్ గా ఆలోచించి శ్వేతాని కెప్టెన్సీ దారునిగా తప్పించాలనే ఉద్దేశ్యంతో శ్వేతని పొడిచింది. బిగ్ బాస్ ఈ వీక్ కెప్టెన్ గా శ్రీరామచంద్ర ఫైనల్ గా నిలిచాడు. ఏది ఏమైనా కెప్టెన్సీ టాస్క్ కోసం సన్నీ, మానస్ లు చూపించిన ఎఫర్ట్ కి సరైన గుర్తింపు దొరక్కపోవడం ప్రేక్షకుల్ని కాస్త డిజప్పాయింట్ చేసింది. ఫుడ్ తినకుండా రెండు రోజులు వర్కవుట్స్ చేసి వెయిట్ తగ్గారు. పవర్ రూమ్ యాక్సెస్ ని పొందిన సన్నీ కెప్టెన్సీ టాస్క్ లో నుంచుంటే చివరికి ఇలాంటి డెసిషన్ తీసుకుంటారా అంటూ ఆడియన్స్ మండిపడుతున్నారు.