తెలియక జరిగిన పొరపాటుకి ఓవర్ యాక్షన్ చేస్తున్న షన్ను

Bigg Boss 5 Telugu Shanmukh Vs Siri

 

బిగ్ బాస్ సీజన్ 5 హాఫ్ సెంచరీకి దగ్గరైంది. ఇక ఈ సీజన్ లో ఇంతకు ముందెప్పుడూ లేని రేంజ్ లో ట్విస్టులు మీద ట్విస్టులు ఇస్తున్నారు. కెప్టెన్స్ టాస్క్ బంగారుకోడిపెట్ట గేమ్ అయిపోయినట్లు ప్రకటించారు. ఈ గేమ్ ముగిసేసరికి మానస్, విశ్వ, సన్నీ, శ్రీరామచంద్ర, రవిలు కెప్టెన్సీ పోటీదారుల లిస్ట్ లో ఉన్నారు. అలాగే స్పెషల్ రూమ్ నుండి లోబోని హౌస్ లో పంపడంతో పాటు రెండు ఎగ్స్ ని కూడా ఇచ్చారు. ఒకటి బ్లాక్ ఎగ్ అలాగే గోల్డ్ ఎగ్.

లోబో ఎవరికి అయితే బ్లాక్ ఎగ్ ఇస్తాడో వాళ్ళు కెప్టెన్సీ పోటీదారుల లిస్ట్ లో నుండి అవుట్ అవుతారు. అలాగే గోల్డ్ ఇస్తే.. వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీదారుడిగా చేరుతారు. అలా లోబో బ్లాక్ ఎగ్ ని శ్రీరామచంద్రకు, గోల్డ్ ఎగ్ ని కాజల్ కి ఇస్తాడు.

నెక్ట్స్ బిగ్ బాస్, జెస్సీకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడని అందుకే జెస్సీ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఆడటానికి వీల్లేదని అన్నారు. దీంతో ఇంత అందంగా బఫూన్ ని చేశారంటూ షన్ను ఫీల్ అవుతారు. ఫ్రెండ్ ఫ్రెండ్ అని నన్న ఇంత దారుణంగా మోసం చేశారని, అసలు నేను దేనికి పనికి రానని, నాకు అసలు ఆట ఆడటం రాదనే కదా నన్ను సెలెక్ట్ చేసుకున్నారని అంటారు. ఇప్పటివరకు ఇంట్లోనే అనుకుంటున్నారు.నెక్ట్స్ బయటకు వెళ్ళాక కూడా అదే అనుకుంటారని షన్ను ఓ రేంజ్ లో ఫీల్ అయ్యాడు.

ఈ టాస్క్ తో నువ్వు ఎవ్వరికీ సపోర్ట్ చేస్తున్నావో నాకు బాగా అర్థమైందని అన్నారు. నీలా నేను నటించలేనని.. నన్ను ఇంకా కిందకి లాగేస్తున్నారని, అసలు నేను మీతో చేసిన ఫ్రెండ్షిప్ కి అస్సలు వాల్యూ లేదని అనడంతో సిరి, జెస్సీలు కూడా కాస్త గట్టిగానే హర్ట్ అవుతారు. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన 47 రోజులకు గానీ షన్ను రియలైజ్ అయ్యాడని.. ఇప్పటికైనా తన గేమ్ తాను ఆడతాడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.