సిరి, షణ్ను, జెస్సీల ఆటిట్యూడ్ ని భరించలేకపోతున్న జనాలు..

bigg boss 5 telugu Siri, Shannu and Jesse Attitude

 

బిగ్ బాస్ హౌస్ సీజన్ 5 మొదట్నుండి గొడవలు వివాదాలకు కళకళలాడిపోతుంది. మన బిగ్ బాస్ కి కావాల్సింది కూడా అదే. కానీ జనాలు మాత్రం కాస్త కూడా ఎంటర్ టైన్ మెంట్ లేకుండా ఎప్పుడు చూసినా ఈ గొడవలేంటి అనే కామెంట్స్ ని బిగ్ బాస్ సీరియస్ గా తీసుకుని హౌస్ మేట్స్ తో ఫన్నీ గేమ్స్, టాస్కులు చేయించారు. అంతా బాగానే ఉంది గానీ ఈ త్రిమూర్తుల పరిస్థితి ఏంటి అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి త్రిమూర్తులు ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ఇంకెవ్వరూ మన సిరి, షణ్ముక్, జెస్సీలు. బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడ చూసినా వీరి ముగ్గురిలో ఏ ఒక్కరూ విడివిడిగా కనిపించిన పరిస్థితులైతే ఇప్పటివరకు లేవు. వీరి ముగ్గురిలో ఏ ఒక్కరితో గొడవ జరిగినా మిగతా ఇద్దరూ ఫైర్ అవ్వాల్సిందే. అయితే ఓ బాండింగ్ ఉండొచ్చు గానీ.. హౌస్ లో వీరి ముగ్గురు మాత్రమే కాదు కదా అనేది జనాల పాయింట్.

నిజమే మరి జనాలకే కాదు, బిగ్ బాస్ ని హోస్ట్ చేసే నాగార్జునకి కూడా వీరి ముగ్గుర్ని మాత్రమే గేమ్ ఆడటంపై ఇరిటేషన్ వచ్చింది. అందుకే ఇకనైనా గేమ్ ని విడివిడిగా ఆడాలని సలహా ఇచ్చారు. అయితే ఎంత విడదీయాలని చూసినా మళ్ళీ మళ్ళీ ఒక దగ్గరే కూర్చుని హస్క్ కొడుతుంటారు. వేరే వాళ్ళ గురించి గాసిప్స్ చెప్పుకుంటారు. మన సిరి అయితే వెనకాల మాట్లాడొద్దంటూ నామినేట్ చేస్తుంది. కానీ తాను చేసేది ఏంటో మరి.. ఏది ఏమైనా బిగ్ బాస్ లో వీళ్ళ ముగ్గురు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారా అంటూ బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జెస్సీ, సిరి, షణ్ముఖ్ ల ఆటిట్యూట్ ని వాళ్ళ దగ్గరే దాచుకుని ఇంటికి వెళ్ళి తమ ముగ్గురి ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.