బిగ్ బాస్ 8 వ వారం ఇంటి నుండి లోబో ఎలిమినేషన్..

Bigg Boss 8th Week Lobo Elimination

 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ని ఫుల్ ఎంటర్ టైనింగ్ గా కండెక్ట్ చేశారు. ఇక వరుస పెట్టి సినీ స్టార్స్ తో బిగ్ బాస్ వేదిక కలర్ ఫుల్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో గత సీజన్స్ లో వచ్చిన కంటెస్టెంట్స్ ని కూడా పిలిపించి మరీ ఎంటర్ టైన్ చేశారు. అలాగే పుష్పక విమానం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వచ్చి వారి స్టైల్ లో అలరించారు.

శ్రియ సరన్, అవికా గోర్ లతో పాటు మరికొంతమంది బిగ్ బాస్ వేదికకు వచ్చేశారు. అలాగే ఈ వీక్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ముగిసింది. 8 వ వారంలో లోబోకి అతి తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయ్యాడు. లోబో కూడా ఈసారి ఎలాంటి సీక్రెట్ రూమ్ ఉండదని ఫిక్స్ అయిపోయి.. ఇంట్లో ఎవర్నైనా బాధపెడితే క్షమించమని అడుగుతాడు. మరీ ముఖ్యంగా కాజల్ కు సారీ చెబుతాడు.

నాగార్జున దగ్గరకు రాగానే.. ఐదుగురు మిత్రులు, ఆరుగురు శత్రువులు ఎవరు అనే గేమ్ ని ఆడించారు. ఈ గేమ్ లో లోబో, బిగ్ బాస్ హౌస్ లో తన ఫ్రెండ్స్ గురించి చెప్పాడు. తనకు ఎప్పుడూ బూస్టప్ ఇచ్చే విశ్వ తన ఫ్రెండ్ అని అన్నారు. కాజల్, సన్నీ, రవి లు తన ఫ్రెండ్స్ అని అన్నారు. ఇక ఐదో ఫ్రెండ్ ఎవరంటే అనీ మాస్టర్ అని అంటాడు. బిగ్ బాస్ హౌస్ లో అనీ మాస్టర్ కెప్టెన్ అయితే మా గల్లీలో పటాకులు కాలుస్తానని అంటారు. ఇక మిగతా హౌస్ మేట్స్ అయిన షణ్ముఖ్, జెస్సీ, సిరి, మానస్, ప్రియాంక, శ్రీరామ్ లు తనకు శత్రువులని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. ఏది ఏమైనా ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో లోబో ఎలిమినేషన్ తో ఇంటి వాతావరణం మొత్తం మారిపోయింది.