బిగ్ బాస్.. 9 వ వారం నామినేషన్ లో 10 మంది హౌస్ మేట్స్

Bigg Boss 5 Telugu 9th Week Nomination

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్ ప్రక్రియను ఇంటి సభ్యులు మొదలుపెట్టారు. ఇంటి కెప్టెన్ గా షణ్ముఖ్ ఎన్నికవ్వడంతో అతన్ని నామినేట్ చేయడానికి కుదరదని బిగ్ బాస్ చెప్పారు. ఫస్ట్ మానస్.. శ్రీరామ్, జెస్సీలను నామినేట్ చేశారు. నెక్ట్స్ సిరి, సన్నీని.. అనీ మాస్టర్ ను నామినేట్ చేస్తూ.. సన్నీ గేమ్ ఆడే విధానం నచ్చలేదని, అనీ మాస్టర్ టాస్క్ లో గివ్ అప్ ఇవ్వడం తనకు నచ్చలేదని అంటుంది. ఆ తర్వాత శ్రీరామ్.. మానస్ ని నామినేట్ చేస్తూ నీకు నాతో ప్రాబ్లెమ్ ఏంటో అర్థం కావటం లేదని అంటాడు. అలాగే సన్నీని నామినేట్ చేస్తూ తనకు కోపం కంట్రోల్ చేసుకోవడం అస్సలు రావడం లేదని అంటాడు.

రవి.. మానస్, కాజల్ ని నామినేట్ చేస్తూ గ్రూపులు పెట్టి మాట్లాడటం గురించి చెప్పి లోబోకి నా గురించి చెడ్డగా చెప్పి నా మీదకే గొడవకు పంపడం అస్సలు నచ్చేలేదని అంటాడు. జెస్సీ.. సన్నీ, మానస్ లను ఫేస్ మీద క్రీమ్ రాసి నామినేట్ చేస్తాడు. నెక్ట్స్ ప్రియాంక.. విశ్వ, రవిలను నామినేట్ చేసింది. ఫైనల్ గా షణ్ముఖ్, ప్రియాంకను, మానస్ లను నామినేట్ చేస్తాడు. ప్రియాంకకు, షణ్ముఖ్ ల మధ్య గేమ్ గురించి గొడవ జరుగుతుంది. ఇక ఈ గొడవలోకి సిరి ఎంటర్ అవుతుంది.

సన్నీతో జెస్సీ హెల్త్ గురించి అలా మాట్లాడవని తాను నామినేట్ చేశానని అంటుంది. సన్నీ మాట్లాడుతూ తాను జెస్సీ మీద అరిచినప్పుడు జెస్సీ కూడా అరిచాడు. అలాంటప్పుడు తనకు హెల్త్ బాలేదని ఎలా అనుకుంటానని అంటాడు. ఈ విషయంలో సన్నీకి, సిరికి గొడవ ఓ రేంజ్ లో హైలెట్ అవుతుంది. ఇక 9 వ వారంలో మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, అనీ మాస్టర్, విశ్వలు నామినేట్ అయ్యారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ వీక్ లో కెప్టెన్ షణ్ముఖ్ తప్ప మిగతా అందరూ ఈ వారం నామినేషన్ లో ఉన్నారు.