బిగ్ బాస్ సీజన్ 5.. షణ్ముఖ్ కి ముద్దులు పెట్టి బ్యాడ్ అవుతున్న సిరి!

Bigg Boss Season 5 Telugu Siri kissing Shanmukh and getting bad

 

బిగ్ బాస్ హౌస్ లో లేటెస్ట్ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ కంటిన్యూ అవుతుంది. మానస్, ప్రియాంకలు మాట్లాడుకుంటారు. హౌస్ లో అందరూ నిన్నే టార్గెట్ చేస్తారని ప్రియాంకకి, మానస్ చెబుతారు. అందుకే నీ గేమ్ నువ్వు ఆడమని సలహా ఇస్తాడు. నెక్ట్స్ గుడ్డు కోసం సిరి, సన్నీ, కాజల్ కి మధ్య డిస్కషన్ జరుగుతుంది. సిరి, షణ్ముఖ్ మాట్లాడుతూ ఉండగానే వచ్చి షణ్నుకి ముద్దు పెడుతుంది. దీంతో షణ్ను షాక్ కి గురవుతాడు. కెమెరాస్ వైపు చూస్తూ జాగ్రత్తగా రికార్డ్ చేశారుగా.. ఇప్పుడు నాకుంటుందని షణ్ను అంటాడు. మళ్ళీ షణ్ముఖ్ దగ్గరకు సిరి వచ్చి, పొసెసివ్ ఫ్రెండ్ అని అనుకుంటారని చెప్పింది. నువ్ మెంటల్లీ డిస్ట్రబ్ లో ఉంటే ఎమోషనల్ ఎటాచ్ అవుతామని షణ్ముఖ్ అంటారు. వెంటనే సిరి, నేను బాగానే ఉన్నానని, నీ వల్లే డిస్ట్రబ్ అవుతున్నానని అంటుంది. చిరాకుగా ఉన్నప్పుడు ఎందుకు ఇబ్బంది పడటం, భరించాల్సిన అవసరం లేదని సో డిస్టెన్స్ లో పెట్టమని, నువ్వు ఫ్రీడమ్ ఇస్తేనే మాట్లాడతానని, టచ్ చేస్తానని అన్నాడు షణ్ముఖ్.

ఈ ఎపిసోడ్ లో సిరి తన క్యారెక్టర్ ని తనే బ్యాడ్ చేసుకుంది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా మానస్, జెస్సీ, సిరి, షణ్ముఖ్, అనీ మాస్టర్, శ్రీరామ్ లు పోటీ పడ్డారు. ఈ టాస్క్ కోసం జెస్సీ సంచాలకునిగా ఉన్నారు. ఈ పోటీలో భాగంగా వెంటాడు వేటాడు అనే టాస్క్ లో థర్మాకోల్ బ్యాగ్స్ ని భుజాన వేసుకుని కంటెస్టెంట్స్ సర్కిల్ గీసిన ట్రాక్ పైనే నడుస్తూ ఉండాలి. ఈ క్రమంలో ఎవరి దగ్గరైతే గేమ్ ఫినిష్ అయ్యే వరకు థర్మాకోల్ బ్యాగ్ ఉంటుందో వాళ్ళే గెలిచినట్లని బిగ్ బాస్ చెబుతాడు. సన్నీ, తన ఫ్రెండ్ కోసం అవుట్ అయ్యాడని శ్రీరామచంద్ర కౌంటర్ వేసి మరీ రెచ్చగొడతాడు.

ఈ టాస్క్ లో సన్నీ అవుట్ అయినందుకు శ్రీరామ్, సన్నీలకు మధ్య మాటలతోనే యుద్దాన్ని ప్రకటించారు. నెక్ట్స్ రౌండ్ లో శ్రీరామ్, మానస్ ని కిందకి తోసేస్తాడు. వారిద్దరూ అవుట్ అని జెస్సీ అంటూ సన్నీ, మానస్ ఔట్ కాదని ఫైర్ అవుతాడు. నెక్ట్స్ రౌండ్ లో సిరి, అనీ మాస్టర్, షణ్ముఖ్ లు గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇక సిరి, షణ్నులు కలిసి అనీ మాస్టర్ ని టార్గెట్ చేయడంతో.. అనీ మాస్టర్ ఇక్కడ కంటెస్టెంట్స్ లో నిజాయితీ లేదని, సిరిని నెట్టేస్తుంది. దీంతో అనీ మాస్టర్ తనను కొరికేసిందని కత్తి పట్టుకుంటుంది. ఇది తప్పని సిరిని, హౌస్ మేట్స్ ఆపుతారు. ఇక గ్రూపులుగా ఆడుతున్నారు. అలాంటప్పుడు ఇండిపెండెంట్ గా ఆడి కెప్టెన్ అవ్వాలంటే ఎలా కుదురుతుందని అనీ మాస్టర్ ఫైర్ అవుతుంది. అలా తనంతట తానే థర్మాకోల్ బ్యాగ్ ని చింపేసి, గేమ్ నుండి బయటకు వచ్చేస్తుంది.