బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించనున్న బిగ్ బాస్ సీజన్ 5

BB 5 Telugu Latest News

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలీటీ షో బిగ్ బాస్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. బోర్ గా ఫీలయ్యేవారికి మంచి వినోదాన్ని అందిస్తూ.. రూమర్లకు ఏ మాత్రం కొదువ లేకుండా సక్సెస్ ఫుల్ ఎంటర్ టైన్ చేసే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సెప్టెంబర్
5న సాయంత్రం 6 గంటలకు ఓ ఉత్సవంలా మొదలుకాబోతుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, అలాగే శని, ఆదివారాల్లో 9 గంటలకు స్టార్ట్ అవుతుంది.

ఈ ప్రోగ్రామ్ కోసం ఎంతోమంది బుల్లితెర అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సీజన్ కోసం కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. కంటెస్టెంట్స్ కూడా ఆల్ మోస్ట్ కన్ఫార్మ్ అవ్వడమే కాకుండా వారంతా క్వారంటైన్ కి వెళ్ళారు. ఇక దాదాపు 100 రోజుల గ్యారెంటీ నాన్ స్టాప్ హంగామా చేయడానికి మన కంటెస్టెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. కంటెస్టెంట్స్ ని డీల్ చేయడంలో మన సోగ్గాడు ఓ రేంజ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.

ఇక నుండి బుల్లితెర ప్రేక్షకులకు అల్టిమేట్ వినోదాన్ని అందించడానికి సిద్ధం అయ్యింది. ఈ షో కోసం బిగ్ బాస్ టీమ్ ఓ ట్యాగ్ లైన్ ని డిజైన్ చేసింది. అదేంటంటే.. చెప్పండి బోర్ డమ్ కి గుడ్ బై.. వచ్చేస్తోంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్..