బిగ్ బాస్ హౌస్ మేట్స్.. కుండలు బద్దలు కొట్టిన ఉమాదేవి!

Bigg Boss 5 Uma Devi Elimination

 

బిగ్ బాస్ వీకెండ్ అంటే ఆ సందడి మాములుగా ఉండదు. గ్రాండ్ ఎంట్రీతో నాగార్జున, హౌస్ మేట్స్ హంగామా.. కొన్ని ఫన్నీ టాస్కులు, మరికొన్ని క్లాసులు.. ఫైనల్ గా ఎలిమినేషన్ బాధలు. ఇలా అన్నీ రకాల ఎమోషన్స్ ని వీకెండ్ లోనే చూపిస్తాడు బిగ్ బాస్. ఈవారం కూడా బిగ్ బాస్ పెట్టిన డాన్సింగ్ కాంపిటేషన్ లో అమ్మాయిలు, అబ్బాయిలతో కలిసి కప్పులో వచ్చిన వారి పేర్లతో డాన్స్ చేయాలి. అలా ఉమాదేవి – షణ్ముక్, లహరి – జెస్సీ, ప్రియ – యాంకర్ రవి, హమీదా – శ్రీరామ్, సిరి – నటరాజ్ మాస్టర్ లు చాలా బాగా డాన్స్ చేశారు. ఈ టాస్క్ లో అబ్బాయిలే ఎక్కువగా స్కోర్ చేసారు. కానీ బిగ్ బాస్ మాత్రం అమ్మాయిలే గెలిచారంటూ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎలిమేనష్ ప్రక్రియలో భాగంగా కాజల్ సేఫ్ అయినట్లు చెప్పాడు.

కాజల్ తనకు మటన్ బిర్యానీ తినాలనిపిస్తుందని అడిగితే నాగార్జున, తాను ఇంట్లో వాళ్ళందరికి మటన్ పంపుతానని కానీ ఆ బిర్యానీని కాజల్ మాత్రమే వండాలని అన్నాడు. దాంతో కాజల్ షాక్ అవుతుంది. ఇంట్లో ఉన్న దెయ్యం అనే గేమ్ తో ఫస్ట్ ప్రియ, సిరి పేరు చెబుతూ దెయ్యం స్టిక్కర్ అతికిస్తుంది. లహరి, ఉమాదేవిని, హమీదా అనీ మాస్టర్ ను, శ్రీరామ్ మానస్ కు దెయ్యం స్టిక్కర్ అతికిస్తారు. అలా ఇంట్లో ప్రతిఒక్కరూ తమ వర్షన్ లో దెయ్యాల స్టిక్కర్లు అతికించారు. నెక్ట్స్ ప్రియ, నటరాజ్ మాస్టర్ లు సేఫ్ అవ్వడంతో ఉమాదేవి ఎలిమినేట్ అయ్యింది. దాంతో లోబో కన్నీళ్ళు ఆపుకున్నాడు.

ఫైనల్ గా రవి బర్త్ డే స్పెషల్ తన భార్యను గుర్తు తెచ్చుకుని ఆమె పంపిన లెటర్ చదివి ఎమోషనల్ అయ్యాడు. ఇక నాగార్జున దగ్గరకు చేరుకున్న ఉమాదేవితో కుండ బద్దలు గేమ్ ఆడించారు. ఫస్ట్ సిరి ఫోటో ఉన్న కుండను బద్దలుకొట్టి, నీకేం అనిపిస్తే అది చేస్తావని ఎదుటివాళ్ళు ఏం ఫీల్ అయినా పట్టించుకోవంటుంది. అలాగే లహరి, ప్రియ, షణ్ముక్ కుండలు బద్దలు కొట్టింది. షణ్ముక్ ఆటను సొంతంగా ఆడమని సలహా ఇస్తుంది. అనీ మాస్టర్ కి కోపం ఎక్కువని అది తగ్గించుకోవాలని చెప్పింది.