బిగ్ బాస్.. ఈ వారం ఎమోషనల్ కనెక్షన్ తో నామినేషన్ ప్రక్రియ!

Bigg Boss5 telugu Nomination process with emotional connection this week

 

బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేషన్స్ మొదలయ్యాయి. అయితే ఈసారి ఎమోషనల్ కంటెంట్ తో ఇంటి సభ్యులతో కనెక్ట్ చేశాడు. ఫ్యామిలీస్ దూరమై దాదాపు 50 రోజులైంది. ఫ్యామిలీ మెంబర్స్ నుండి లెటర్స్ వస్తాయి. వీటిని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో ఒకరి లెటర్ ని వదులుకోవాలని.. వాళ్ళు నామినేట్ అవుతారని అన్నారు. ఫస్ట్ శ్రీరామ్, మానస్ లకు పోస్ట్ వస్తే అందులో ప్రియాంక, లోబోలకు కార్డ్స్ ఉన్నాయి. అందులో ప్రియాంక లెటర్ తీసుకుంటుంది.. లోబో నామినేట్ అవుతారు.

నెక్ట్స్ సిరి, విశ్వకు తమ ఇంటి నుండి పోస్ట్ వస్తుంది, విశ్వ తన కొడుకు గురించి తెలుసుకోవాలనుందని కన్విన్స్ చేయడం.. సిరి, విశ్వ కోసం త్యాగం చేస్తుంది. సిరి కూడా ఓ బాబు తన దగ్గరే ఉంటున్నాడని, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అంటుంది. ఆ తర్వాత.. మానస్, అనీ మాస్టర్ కోసం లెటర్ త్యాగం చేస్తాడు.

అనీ మాస్టర్ తన లెటర్ చదువుకుని చాలా ఎమోషనల్ అవుతుంది. నెక్ట్స్ రవి, శ్రీరామ్ హౌస్ నుండి వచ్చిన లెటర్స్ లో శ్రీరామ్ దక్కించుకుని, రవి నామినేట్ అవుతాడు. నెక్ట్స్ నామినేషన్ లో భాగంగా కాజల్, షణ్ముఖ్ లెటర్స్ ఉంటాయి. షణ్ముఖ్, కాజల్ కోసం లెటర్ ఇచ్చేస్తాడు. షన్ను.. అమ్మా కాన్సర్ ని తట్టుకున్నావ్, అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా భరించావు, నువ్వే నాకు ఇన్సిపిరేషన్ అంటూ నేను స్ట్రాంగ్ గా ఉన్నానని చెబుతాడు.

నెక్ట్స్ సన్నీని స్పెషల్ రూమ్ కి పిలిచి.. ఫైనల్ గా జెస్సీకి ఓ లెటర్ వచ్చిందని, అతన్ని నామినేట్ చేయాలనుకుంటే ఆ లెటర్ ని చింపేయాలని.. లేదనుకుంటే హౌస్ మేట్స్ లో ఒకరి లెటర్ ని తీసేసి.. జెస్సీ లెటర్ ని తనకే ఇచ్చి సేవ్ చేయాలని అన్నారు. ఇంటి సభ్యులు వారంతా లెటర్స్ చదివామని.. జెస్సీ లెటర్ ని టచ్ కూడా చేయలేదని శ్రీరామ్ తన లెటర్ ని త్యాగం చేసి.. నామినేట్ అయ్యారు. ఫైనల్ గా ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేట్ అయిన సభ్యులు లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామచంద్ర. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యుల్ని ఎమోషనల్ గా నామినేట్ చేశారు.