బిగ్ బాస్ ఈ వీక్ నామినేషన్ లో విశ్వరూపం చూపించిన లోబో!

bigg boss5 telugu this week nominations shocking lobo

 

బిగ్ బాస్ గాసిప్స్ హౌస్ లో నాలుగో వారంలో నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. ఒక్కో కంటెస్టెంట్ ఇంట్లో ఇద్దర్ని నామినేట్ చేయాలనే రూల్ తో రచ్చ మొదలైంది. ఇంటి సభ్యుల్లో ఎవర్ని అయితే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలో ఒక భాగాన్ని తీసి స్విమ్మింగ్ పూల్ లో పడేయాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఇక వీటితో పాటు కారణాలు చెప్పడం కూడా కామనే. ఫస్ట్ ప్రియతో నామినేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయడంతో ఆమె కారణాలతో లోబో, సన్నీని నామినేట్ చేస్తుంది. విశ్వ.. రవిని, నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తాడు. అలా ఒక్కోక్కరూ తమకు కోపం వచ్చిన కారణాలు, తప్పనిపించిన సిట్యూవేషన్స్ ని వివరిస్తూ మొత్తంగా ఎనిమిది మంది ఎలిమినేషన్ లో ఉన్నారు. నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, అనీ మాస్టర్ ల్ని ఇంటిసభ్యులు ఎక్కువగా నామినేట్ చేశారు.

వీరిలో ముఖ్యంగా ప్రియ తనతో లోబో, సన్నీలు మాట్లాడటం లేదని, దూరంగా ఉంటున్నారని అందుకే నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. లోబో, ప్రియను నామినేట్ చేస్తూ ఓ రేంజ్ లో విరుచుపడ్డాడు. అందరూ లవ్ స్టోరీలు చెప్తున్నప్పుడు, లోబో ఓ 14 ఏళ్ళ అమ్మాయిని లవ్ చేశానని చెబితే, అదొక సినిమా స్టోరీలా ఉందని కామెంట్ చేశావని.. ఆ నిమిషంలో నా ఖలేజా పగిలింది అంటూ ప్రియ మీద విరుచుకుపడ్డాడు. చాలా పెద్దగా అరిచేస్తూ ప్రియ మీదకు రావడంతో ఇంటి సభ్యలు కంట్రోల్ చేస్తారు. ఆ తర్వాత రవి దగ్గర లోబో ఏడుస్తూ.. నా లవ్ స్టోరీ గురించి నీకు తెలుసు కదా అంటూ ఎమోషనల్ అవుతాడు. లోబో, ప్రియ మీద అంత ఎత్తున అరవడంతో చాలా ఎమోషనల్ అవుతూ ఏడ్చేస్తుంది. గాసిప్స్, రూమర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బిగ్ బాస్ హౌస్ లో లేటెస్ట్ గా ఇంటి సభ్యులు తన్నుకోవచ్చు అనే నియమం కూడా పెట్టినట్లుగా ఉంది. ఏ చిన్న విషయానికి అయినా అంత ఎత్తున లేచి గోల చేయడం తర్వాత కామ్ అయిపోవడం నామినేషన్ ప్రక్రియలో ఓ భాగమైంది.