బ్లాక్ పెప్పర్ వాటర్ తో అనారోగ్యాలకు ఇలా చెక్ పెట్టండి..

Black Pepper With Hot Water Benefits

 

చాలామంది కిచెన్ లో మిరియాలు మస్ట్ గా ఉంటాయి. వంటల్లో టేస్ట్ పెంచడంలో మిరియాలది ఫస్ట్ ప్లేస్. అంతేకాదు ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించడంలోనూ పెప్పర్ ది బెస్ట్ అనే చెబుతారు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి రోజూ తాగితే చాలు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరంగా పెట్టవచ్చు. పెప్పర్ వాటర్‌ని కనీసం ఒక నెలపాటు తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

రోగనిరోధకతను పెంచడంతో పాటుగా బరువును తగ్గించటంలో బ్లాక్‌ పెప్పర్ వాటర్‌ బెస్ట్‌ అనే చెప్పాలి. దీనివల్ల బరువు అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపరచడమే కాకుండా అధిక క్యాలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది. తరచుగా ఈ నీళ్లు తాగడం వల్ల కేవలం నెలరోజుల్లోనే మీ శరీర బరువులో వచ్చే మార్పు క్లియర్ గా తెలుస్తుంది.

మలబద్దకంతో బాధపడేవారు ఈ నీటిని ప్రతిరోజూ తప్పనిసరిగా తాగాలి. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరచి, మంచి జీర్ణక్రియకు దారితీసేలా చేస్తుంది. శరీరం నుంచి వ్యర్థాలను తొలగించి, కడుపును తేలిక పరుస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ మిరియాల పొడిని కలిపి పరగడుపునే తాగితే బరువు తగ్గుతారు.

బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను తీసుకుని అందులోంచి ఒక చుక్క ఆయిల్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి పరగడుపునే తాగినా శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. అల్లం రసం, తులసి ఆకులు, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి వేసి చేసిన గ్రీన్ టీ తాగితే బరువు త్వరగా తగ్గుతారు. అర కప్పు మోతాదులో పుచ్చకాయ, పైనాపిల్ జ్యూస్‌లను తీసుకుని వాటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్నిప్రతిరోజు ఉదయాన్నే తాగినా బరువు తగ్గుతారు.

మిరియాల పొడి ఫ్రీ రాడికల్స్‌ నుంచి, సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. పేగుల ఆరోగ్యం పైనే పూర్తి శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మిరియాలు కలిపిన వేడి నీరు శరీరంలోని వ్యర్థాలను, రసాయనాలను పూర్తిగా బయటకు పంపివేస్తుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపరచి, కడుపులోని పేగు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

వేడి నీటిలో, నల్ల మిరియాల పొడి కలిపి తాగితే హెల్త్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మ కణాల పోషణకు తోడ్పడి స్కిన్ ను ఎ‍ప్పుడూ హైడ్రేటెడ్‌ గా ఉండటానికి సహాయపడుతుంది. చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేయడమే కాకుండా, రోజు మొత్తం యాక్టివ్‌ గా ఉండటానికి పనికొస్తుంది. పెప్పర్‌ వాటర్‌ ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీవక్రియ బలం పుంజుకుని శక్తి రెట్టింపయ్యేటట్లు చేస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేసి, చర్మం ప్రకాశవంతంగా మెరిపిస్తుంది.