
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో దర్శకధీరుడు రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క నెలలోనే ఒకే హీరోకు చెందని రెండు భారీ సినిమాలు విడుదల చేయటం సరైందికాదని, ఇప్పటికే బోనీ కపూర్ రాజమౌళితో మాట్లాడినా… ఫలితం లేకుండా పోయింది. అయితే బోనీ కపూర్ అజయ్ దేవగన్ హీరోగా మైదాన్ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.. దీంతో అక్టోబర్ 15న 2021 విడుదల చేయాలని నిర్ణయించారు. మైదాన్ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయిన తర్వాతే ఆర్.ఆర్.ఆర్ రాజమౌళి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అజయ్ దేవగన్ ఆర్.ఆర్.ఆర్ లోనూ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. దీంతో ఒకే హీరోకు చెందిన రెండు భారీ ప్రాజెక్టులు రిలీజ్ చేస్తే ఇబ్బంది అంటూ తను రాజమౌళితో ఫోన్లో మాట్లాడానని, సినిమా రిలీజ్ విషయంలో తన ప్రమేయం లేదని చెప్పాడన్నారు.