బోయపాటి శ్రీను-బాలకృష్ణ బిబి3 మూవీ టైటిల్ ముహూర్తం ఫిక్స్

Boyapati Sreenu-Balakrishna Movie Title Muhurtam Fix
Boyapati Sreenu-Balakrishna Movie Title Muhurtam Fix

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బిబి3 సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ రోర్ అభిమానులు విశేషంగా ఆకట్టుకుంది. చిత్ర యూనిట్ ఈ సినిమా మే 28న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఈ మూవీ టైటిల్ ను మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇక బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షెడ్యూల్ పూర్తిచేసుకుంది. తరువాత షెడ్యూల్ కోసం లొకేషన్ ల వెతికే పనిలో ఉన్నారు డైరెక్టర్ బోయపాటి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.