ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

By Election

దేశంలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పశ్చిమ బెంగాల్‌లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్‌లో భవానీపూర్, షంషేర్‌గంజ్, జంగీపూర్, ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30న పోలింగ్, అక్టోబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. ఈ నెల 6న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 13వ తేదీ తుది గడువుగా ఎన్నికల సంఘం పేర్కొంది.