మూడు నెలలు సాము నేర్చి మూలనున్న ముసలమ్మ ను కొట్టారు చంద్రబాబు..!

Chandrababu beat Musalamma in the corner after learning Same for three months
Chandrababu beat Musalamma in the corner after learning Same for three months

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం లో ప్రధాని మోడీ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత , మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై YSRCP నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. మూడు నెలలు సాము నేర్చి మూలనున్న ముసలమ్మ ను కొట్టారు చంద్రబాబు నాయుడు అంటూ తన ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక కాపీ పేస్ట్ లెటర్ రాయడానికి 15 రోజులు టైం కావాలా అంటూ ఎద్దేవా చేశారు.

అయితే లేఖలో చంద్రబాబు ప్రైవేటీకరణ వద్దని మాత్రం చెప్పలేదు అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. పైగా లాభదాయకంగా నడపాలి అంటూ ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే తప్పనిసరి అని ఆ లేఖ సందేశం అంటూ YSRCP ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. చిత్తశుద్ది లేని శివ పూజలేల చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తూ . మీ పాదయాత్ర కన్నా, ఈ లేఖకే ఎక్కువ దమ్ముంది అంటూ చెప్పుకొచ్చారు.