కరోనా సంక్షోభంలో సినీ ఇండస్ట్రీ.. ఎమోషనల్ అయిన చిరంజీవి

Chiranjeevi Emotional movie industry in the corona crisis

 

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల డైరెక్ట్ ఈ సినిమాని 24న థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేశారు. ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలు వచ్చి వేదికపై సందడి చేశారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. లవ్ స్టోరీ సినిమా కోసం హార్డ్ వర్క్ చేసిన ప్రతిఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఇండస్ట్రీ కరోనా సంక్షోభానికి ఏవిధంగా లోనయిందని.. ఎంతోమంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని.. చిరు ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారని అన్నారు. సినీ ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, దర్శకులు కాదని.. వారు బాగున్నంత మాత్రాన మిగతా సినీ పరిశ్రమంతా ప్రశాంతంగా ఉన్నట్లు కాదని అన్నారు. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్న వారు ఎంతోమంది ఉన్నారని అన్నారు.

ఒక్కసారిగా షూటింగ్ ఆగిపోతే కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారన్నది ప్రతి ఒక్కరికి తెలుసని.. అందుకే వారి అవసరాలు కాస్తలో కాస్త తెలుసుకుని నిత్యావసరాలు అందించి కొంత సాయపడ్డామని అన్నారు. అలాగే ఎలాంటి విపత్తులు వచ్చిన వాళ్ళకు సాయం చేయడంలో సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంటుందని చిరంజీవి అన్నారు. అలాంటి సినీ ఇండస్ట్రీ కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉందని అన్నారు. ఈ విషయంపై తెలుగు రాష్ట్రాలు సినీ ఇండస్ట్రీకి సానుకూలంగా స్పందించి సరైన న్యాయం చేయాలని చిరు రిక్వెస్ట్ చేసారు.