గాడ్ ఫాదర్ షూటింగ్ బ్రేక్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్!

Chiranjeevi Godfather Movie Latest News

 

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్థార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టిన చిరంజీవి తన చేతికి గాయం కావడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఆ దెబ్బ చిన్నదే అని.. ఎవ్వరూ కంగారు పడకూడదని తెలిపారు. ఇప్పుడు లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గాఢ్ ఫాదర్ సెట్ మీదకు వచ్చారు. ఇక బ్రేక్ లేకుండా షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. నవంబర్ 1 వ తేదీన ఈ విషయాన్ని ఫిల్మ్ టీమ్ అధికారికంగా అనౌన్స్ చేశారు. గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి కీలకమైన షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు.

మలయాళం సినీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా మోహన్ రాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పాలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది. అలాగే మెగా స్టార్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేశారట. ఈ సినిమా షూటింగ్ కి ఇప్పటికే చాలా సార్లు బ్రేక్ పడటంతో ఈసారి ఎలాగైనా సరే కంటిన్యూగా పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాని కొణిదెల బ్యానర్ తో పాటు ఎన్వీ ప్రసాద్ లు కలిసి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ ని తమన్ ఎస్ ఎస్ అందిస్తున్నారు. ఈ సినిమాలో చిరు తల్లి పాత్ర కోసం గంగవ్వను తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో తెలుగు, తమిళం, హిందీ భాషల నటీనటుల్ని తీసుకుంటున్నారు. నెక్ట్స్ ఈనెలలో భోళా శంకర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని ఫిల్మ్ టీమ్ అధికారికంగా తెలిపారు.