తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన చిరంజీవి

Chiranjeevi made shocking comments on Telugu State Governments

 

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయాన్ని మర్చిపోయారనే విషయాన్ని గుర్తు చేశారు. సినీ సెలెబ్రిటీలకు అందించే అవార్డుల గురించి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. సంతోషం అవార్డుల సెలెబ్రేషన్స్ జరిగాయి. ఆ వేడుకలో తెలంగాణ ప్రభుత్వం నుండి మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవిలు స్పెషల్ గెస్టులుగా వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా సంతోషం పత్రిక స్టార్ట్ చేసి ఆ పేరుతో అవార్డులను అందించడం అనే సాధారణ విషయం కాదని అన్నారు.

బలమైన ఆశయ సాధన ఉంటేనే ఇలాంటి పనులు చేయగలం అని ఇది ఇలాగే కొనసాగాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇలాంటి అవార్డులను ప్రభుత్వం అందించాలని కానీ ఈ విషయాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మర్చిపోయాయని అన్నారు. ఇకనైనా ఈ విషయంపై ఆలోచించి కళాకారుల్ని సత్కరించాలని అన్నారు. ఈ విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటులో సినీ రంగానికి అందించే అవార్డుల విషయంలో ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. గతంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంది అవార్డులను మూడేళ్ళకు సెలెక్ట్ చేశారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో సెలెక్ట్ చేసిన వారికి అవార్డులు ఇవ్వలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ విషయంపై చిరు వ్యాఖ్యల్ని పట్టించుకుని రెండు తెలుగు రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాలి.